Mar 26,2023 11:42

అమరావతి : కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ .... నేడు కాంగ్రెస్‌ పార్టీ సంకల్ప్‌ సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో .... అన్ని రాష్ట్రాలు, జిల్లా కేంద్రాలలో గాంధీ విగ్రహాల ఎదుట నిరసనలు కొనసాగుతున్నాయి. పరువు నష్టం కేసులో శిక్షపడి, ఎంపీగా అనర్హతను ఎదుర్కొంటున్న రాహుల్‌ గాంధీకి సంఘీభావంగా ఈ దీక్షలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ అధిష్టానం తెలిపింది. విజయవాడలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పిసిసి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష ప్రారంభమైంది. హైదరాబాద్‌ గాంధీభవన్‌ లో ఏఐసీసీ ఇంచార్జీ మాణిక్‌ రావు థాక్రే, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సమక్షంలో దీక్ష జరుగుతుంది. ఈ దీక్షలో జానారెడ్డి, వీహెచ్‌, పొన్నాల, షబ్బీర్‌ అలీ, కోమటిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.