గుడిపాల (చిత్తూరు) : ప్రైవేటు బస్సు బోల్తాపడి ఇద్దరికి తీవ్రగాయాలవ్వగా, 22 మందికి గాయాలైన ఘటన బుధవారం చిత్తూరు జిల్లాలో జరిగింది.
పోలీసుల కథనం మేరకు ... పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు.. గుడిపాల మండలంలోని చిత్తూరు- వేలూరు జాతీయ రహదారిపై గొల్లమడుగు వద్ద మలుపు తిరుగుతుండగా.. అదుపుతప్పి గోడను ఢకొీట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సికింద్రాబాద్‌కు చెందిన లలిత (65), తమిళనాడులోని మానియంబాడికి చెందిన కుబేంద్రన్ (35)లకు తీవ్రగాయాలయ్యాయి. మరో 20మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










