రాయదుర్గం (అనంతపురం) : ప్రైవేటు బస్సుకు తృటిలో ప్రమాదం తప్పిన ఘటన బుధవారం రాయదుర్గంలో జరిగింది. రాయదుర్గం నుండి కర్నాటక రాష్ట్రంలోని మొలకాల్మురు వైపు జాతీయ రహదారిపై వెళుతున ప్రైవేటు బస్సు 20వ వార్డు పైతోట దగ్గర అదుపుతప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢకొీట్టింది. ఎదురుగా వస్తున్న మరో ప్రైవేటు బస్సును ఢకొీట్టింది. ఈ ఘటనలో ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.










