కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సియోల్: కొరియా ఓపెన్ సూపర్300 బ్యాడ్మింటన్ టోర్నీ భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. మంగళవారం జరిగిన తొలిరౌండ్ పోటీల్లో ఇక హెచ్‌ఎస్ ప్రణయ్ రాయ్, ప్రియాంశు రాజవత్ శుభారంభం చేయగా.. టాప్‌క్లాస్ షట్లర్లు పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ ఇంటిదారి పట్టారు. బుధవారం నుంచి ప్రారంభమైన కొరియా ఓపెన్ తొలిరౌండ్ పోటీలో కిదాంబి శ్రీకాంత్ 21-12, 22-24, 17-21తో మాజీ నంబర్‌వన్ ఆటగాడు కెంటో మొమొటో(జపాన్) చేతిలో పోరాడి ఓడగా.. మహిళల సింగిల్స్‌లో పివి సింధు 18-21, 21-10, 13-21తో వైపి పారు(చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడింది. పురుషుల సింగిల్స్‌లో ఇతర పోటీల్లో మిథున్ మంజునాథ్ 11-21, 4-21తో ఎన్‌జి టిాయంగ్(మలేషియా) చేతిలో, కిరణ్ జార్జి 17-21, 9-21తో వాంగ్(చైనీస్ తైపీ) చేతిలో వరుససెట్లలో ఓడారు. ఇక హెచ్‌ఎస్ ప్రణరు 21-13, 21-17తో కరగ్గీ(జర్మనీ)పై, ప్రియాంశు 21-15, 21-19తో ఛోరుాజోాహూన్(కొరియా)పై నెగ్గి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లారు.
ఇక మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్లంతా తొలిరౌండ్‌లోనే ఓటమిపాలయ్యారు. పివి సింధుతో పాటు హేమంత్ 11-21, 17-21తో కవకామి(జపాన్), ఛాలిహా 13-21, 12-21తో చెన్ యుఫీ(చైనా), మాల్విక బన్సోద్ 17-21, 7-21తో థాయ్ (తైపీ), మీర్ 11-21, 18-21తో కిమ్(కొరియా) చేతిలో వరుససెట్లలో ఓడారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-కపూర్ జోడీ 21-17, 21-17తో ఫిలిప్పీన్ జోడీపై గెలుపొందగా.. పొన్నప్పాబిఎస్ రెడ్డి జోడీ 21-23, 21-13, 12-21తో కొరియా జోడీ చేతిలో ఓడింది.










