Aug 04,2023 22:30

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌ సూపర్‌500 బ్యాడ్మింటన్‌ టోర్నీ సెమీఫైనల్లోకి హెచ్‌ఎస్‌ ప్రణయ్, ప్రియాన్షు ప్రవేశించారు. ప్రపంచ 9వ ర్యాంకర్‌ ప్రణయ్ 16-21, 21-17, 21-14తో ఆంథోనీ గిన్‌టింగ్‌(ఇండోనేషియా)పై చెమటోడ్చి నెగ్గాడు. దీంతో ప్రణరు ఈ ఏడాది మూడో బిడబ్ల్యుఎప్‌ ప్రపంచ టూర్‌ ఈవెంట్‌లో సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. ఇక మరో క్వార్టర్‌ఫైనల్లో ప్రియాన్షు 21-13, 21-8తో సహచర ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌పై వరుససెట్లలో గెలిచాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రియాన్షు 31ర్యాంక్‌ ప్లేయర్‌. ఈ ఏడాది వరల్డ్‌ టూర్‌ సూపర్‌ా500 ఈవెంట్‌లో తొలిసారి ప్రియాన్షు సెమీస్‌కు చేరాడు. శనివారం జరిగే సెమీస్‌లో ప్రియాన్షు రాజ్‌వత్‌.. హెచ్‌ఎస్‌ ప్రణరుతో తలపడనున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో పివి సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో సింధు 12-21, 17-21తో 4వ సీడ్‌ బివెన్‌ జంగ్‌ చేతిలో ఓటమిపాలైంది.