Jul 27,2023 21:47
  • జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

టోక్యో: జపాన్‌ ఓపెన్‌ సూపర్‌-750 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి హెచ్‌ఎస్‌ ప్రణయ్ రాక్వార్టర్స్‌కు ప్రణయ్, లక్ష్యసేన్‌, లక్ష్యసేన్‌ దూసుకెళ్లారు. గురువారం జరిగిన ప్రి క్వార్టర్‌ఫైనల్లో 8వ సీడ్‌ ప్రణరు రాక్వార్టర్స్‌కు ప్రణయ్, లక్ష్యసేన్‌19-21, 21-9, 21-9తో సహచర ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌పై పోరాడి నెగ్గాడు. హోరాహోరీగా జరిగిన పోరులో తొలి సెట్‌ కోల్పోయినప్పటికీ వెనుకడుగు వేయకుండా అద్భుత పోరాట పటిమ కనబరిచాడు. వరుసగా రెండు గేమ్‌లు సొంతం చేసుకొని క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. శ్రీకాంత్‌పై ప్రణయ్ కు నాలుగేళ్ల తర్వాత ఇదే తొలి విజయం. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో ప్రణరు రాయ్ టాప్‌సీడ్‌, డెన్మార్క్‌కు చెందిన విక్టర్‌ అక్సెల్సన్‌తో తలపడనున్నాడు. మరో పోటీలో లక్ష్యసేన్‌ 21-14, 21-16తో సునేయమా(జపాన్‌)పై వరుససెట్లలో నెగ్గాడు. క్వార్టర్స్‌లో కోకీ వటనబే(జపాన్‌)తో తలపడనున్నాడు.

  • సాత్విక్‌-చిరాగ్‌ ముందంజ

భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జపాన్‌ ఓపెన్‌లోనూ సత్తా చాటుతున్నారు. గురువారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో 3వ సీడ్‌ సాత్విక్‌-చిరాగ్‌ జంట డెన్మార్క్‌కు చెందిన జెప్పె బే, లస్సె మొల్మొడేపై 21-17, 21-11తో గెలుపొందారు. క్వార్టర్స్‌లో చైనీస్‌ తైపీకి చెందిన వాంగ్‌ చి లిన్‌, లీ యాంగ్‌తో పోటీపడనున్నారు.