ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని నగర మేయర్ మహమ్మద్ వసీం పిలుపునిచ్చారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని నగర పాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్‌లో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్ర పటానికి మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్యతో కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ.. ప్రకాశం పంతులు అతి సామాన్య కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు. దేశ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో ఆయన పాల్గొన్నారని.. సైమన్ కమిషన్ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ తుపాకీ ఉండకు ఎదురొడ్డి నిలిచారన్నారు. దమ్ముంటే కుండలపై కాల్చాలని గుండెలపై కాల్చాలని గుండె చూపిన ధీరోదాత్తుడు అని కొనియాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. భాషా ప్రయత్నాల రాష్ట్రాలు క్రింద భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద ఏర్పడిన తొలి ఆంధ్ర రాష్ట్రానికి ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రిగా పని చేశారన్నారు. దేశ స్వాతంత్ర సముపార్జనకై తన యావదాస్తిని దేశం కోసం ధారబోసిన త్యాగశీలి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కమల్ భూషణ్, అనిల్ కుమార్ రెడ్డి, ఎస్‌ఈ నాగ మోహన్, కార్యదర్శి సంగం శ్రీనివాసులు తోపాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.










