Oct 03,2023 17:21

ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మంగళవారం ఆదోనిలోని ఖీజీపురా ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి సంతకాల సేకరణ చేస్తూ టీడీపీ మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె ఆది కృష్ణమ్మ పోస్టు కార్డు ఉద్యమం ఉదృతం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు ఉపకారం చేయడం తప్ప అపకారం తెలియని మనిషి అన్నారు. వివిధ మార్గాలను అనుసరిస్తూ శాంతియుతంగా అనేక మంది ప్రజలు స్వచ్చంధంగా తమ నిరసనలు తెలుపుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో వస్తే ప్రవేశపెట్ట సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్‌ ఉపాధ్యక్షులు గుడిసె శ్రీరాములు, వడ్డేమాన్‌ గోపాల్‌ , సాదిక్‌ వాలి మండగిరి బాబురావు, బెస్త నరసింహులు, ఖాదర్‌ బాష, వెంకటేష్‌, రాము, గిరిదర్‌ భారత్‌ వీరేష్‌, టిడిపి ముస్లిమ్స్‌ మైనార్టీ కార్యకర్తలు తాహెర్‌, అయాన్‌, మన్సూర్‌, నూర్‌ భాషా, కలందర్‌, అక్రం, స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు