ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:మార్చి 2024లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ విడుదలైంది. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం చదివే విద్యార్థులు ఎలాంటి జరిమానా లేకుండా నవంబరు ఒకటో తేదీ నుంచి 30 వరకు రూ.550 ఫీజు చెల్లించొచ్చని తెలిపింది. రూ.వెయ్యి జరిమానాతో డిసెంబరు 16లోపు చెల్లించాలని పేర్కొంది.










