Oct 30,2023 12:43

తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో... సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్‌ను ముగించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ను నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో తెలిపింది. మిగతా 106 స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరుగుతుందని స్పష్టం చేసింది.