Oct 21,2023 13:17

తెలంగాణ : ఇప్పుడిప్పుడే డెంగ్యూ నెమ్మదిస్తుందనగా ... న్యుమోనియా తెలంగాణను వణికిస్తోంది. హైదరాబాద్‌ సహా దాదాపు అన్ని జిల్లాల ఆసుపత్రులు న్యుమోనియా రోగులతో నిండిపోతున్నాయి.

                                                            రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారే టార్గెట్‌ ...!

వైరస్‌, బ్యాక్టీరియా ద్వారా వ్యాపించే న్యుమోనియా వ్యాధి రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని వ్యాపిస్తుందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు, పొగతాగేవారు, మద్యం తాగేవారు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు ఈ న్యుమోనియాతో ఎక్కువ సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నారని, వాతావరణ మార్పుల వల్ల ఈ కేసులు ఇటీవల కాలంలో బాగా పెరిగాయని వైద్యులు తెలిపారు.

                                                                               న్యుమోనియా లక్షణాలు ..

జలుబు, జ్వరం, కండరాల నొప్పులు, దగ్గు, తలనొప్పి, చెమటలు పట్టడం, వికారం, వాంతులు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోగుల నుంచి ఇది దగ్గు, తమ్ములు, నోటి తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని, కాబట్టి రోగులు మాస్కు ధరించాలని వైద్యులు తెలిపారు. పై లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.