Apr 11,2023 15:33

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ నారాయణరావు పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా స్థానిక వలంద పాలెంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతి నిర్మాణానికి సమాజంలో ఉన్న అంతరాలను తొలగించేందుకు నడుం బిగించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య, మొటమర్రి బాబా ప్రసాద్‌, మచిలీపట్నం నగర బీసీ సెల్‌ అధ్యక్షులు గోకుల్‌ శివ, బీసీ రాష్ట్ర నాయకులు రాళ్ల కొట్టు నాగ రాము , లంకె నారాయణ ప్రసాద్‌ , బత్తిన దాసు ,మొటమర్రి బాబా ప్రసాద్‌ , గోపు సత్యనారాయణ ,కుంచె నాని ,ఇలియాష్‌ షాషా, పిప్పల్ల వెంకన్న , మరియు తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.