ఉగాండా ఆఫ్రికాలో ఒక ముత్యం. ఉగాండాకు తూర్పున కెన్యా, ఉత్తరాన సుడాన్, పశ్చిమాన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దక్షిణాన రువాండా, మరియు దక్షిణాన టాంజానియా సరిహద్దు ప్రాంతాలు. ఉగాండా ప్రజలు ప్రకృతిని ప్రేమిస్తారు. అందుకే వీరు చెట్లను అక్రమంగా కోయడానికి కూడా అనుమతించరు. ఇక్కడి అడవులు పచ్చగా, వివిధ జాతుల వన్యప్రాణులతో నిండి ఉంటాయి. నగరాల్లో సైతం మూడుమొక్కల్ని నాటాకే ఎవరైనా చెట్టును కొట్టేయడానికి అనుమతిస్తారు. ప్రపంచంలోని చాలా పేద దేశాలలో ఉగాండా ఒకటి. 50 శాతం మంది ప్రజలు రోజుకు 67 రూపాయల కన్నా తక్కువ జీవనభృతిని పొందుతున్నారు. డబ్బుకు పేదవారైనా ఆతిథ్యానికి పెద్దవారుగా ప్రపంచ ప్రసిద్ధి పొందారు ఉగాండా ప్రజలు. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ వారికి సంతోషంగా ఎలా ఉండాలో తెలుసు.
















