Sep 15,2023 15:43

ప్రజాశక్తి- ఆత్మకూరు:ఆత్మకూరు మండల కేంద్రంలో శుక్రవారం గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పూటకో మాట... రోజుకో గడప... ఇదీ పవన్‌ కళ్యాణ్‌ వరస.. పవన్‌ కళ్యాణ్‌ టిడిపితో పొత్తు వ్యవహారంపై మండిపడ్డారు. నిలకడ లేని వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌ అని ధ్వజమెత్తారు. 2014లో పార్టీ పెట్టాడు కానీ పోటీ చేయలేదు. చంద్రబాబు జెండా పట్టుకుని దేశమంతా తిరిగాడు. ఆయనను గెలిపించాడు. చంద్రబాబు తరఫున వకాల్తా పుచ్చుకున్నాడు. చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తే ఆ మోసంలో ప్రధాన పాత్రదారి పవన్‌ కళ్యాణ్‌. 2019లో ప్రత్యేకంగా పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేశాడు. ఆ సమయంలో చంద్రబాబు దోపిడీదారుడు, దుర్మార్గుడు, లక్ష కోట్లు తిన్నాడంటూ ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. మరి ఈరోజు సిగ్గు లేకుండా అదే చంద్రబాబుతో కలిసి ఒప్పందం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి జంటగా జనాల్ని మోసం చేసేందుకు వస్తున్నారు. సొంతంగా పార్టీ పెట్టి జెండా అజెండా లేని వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌. తాను సీఎం అభ్యర్థి అని చెప్పుకోలేని వ్యక్తి. ఎంతసేపూ చంద్రబాబు భజన పాడుతాడు. జయం జయం చంద్రన్న అంటూ పాట పాడడం తప్ప నేను సీఎం అవుతా ప్రజలకు పలానా చేస్తా అని చెప్పలేని చవట దద్దమ్మ పవన్‌ కళ్యాణ్‌. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్న చందంగా వీరి పొత్తుతో ఒరిగేదేమీ లేదు. తెలిపారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మండల అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు