- శ్రీలంకపై నాలుగు వికెట్ల తేడాతో గెలుపు
గాలే: శ్రీలంకతో జరిగిన తొలిటెస్ట్‌లో పాకిస్తాన్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 4వికెట్ల నష్టానికి 131పరుగులతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ జట్టు శ్రీలంక నిర్దేశించిన 208పరుగుల లక్ష్యాన్ని 6వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్ గెలుపులో సౌద్ షకీల్ కీలకపాత్ర పోషించాడు. దీంతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ జట్టు 1-0 ఆధిక్యతలో నిలిచింది. అరంగేట్రం ఆటగాడు షకీల్ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. దీంతో పాక్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 461పరుగులు చేయడంతో ఆ జట్టు 149పరుగుల ఆధిక్యతను సంపాదించిన అఘా సల్మాన్‌తో కలిసి 177పరుగుల భాగస్వామ్యాన్ని, నెలకొల్పాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షకీల్‌కు లభించగా.. 2వ, చివరి టెస్ట్ కొలంబో వేదికగా సోమవారం నుంచి ప్రారంభం కానుంది.










