Jul 23,2023 14:33

ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఎమర్జింగ్‌ ఆసియా కప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ యువ జట్ల మధ్య ఫైనల్‌లో పాకిస్తాన్‌ జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి భారత్‌-ఎ కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ అనూహ్యంగా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ జట్టు ఓపెనర్లు సయిమ్‌ ఆయుబ్‌ 58, సహిబ్జదా ఫర్మాన్‌69 పరుగులు చేసి శుభారంభం ఇచ్చారు. ఆతరువాత బ్యాటింగ్‌కు వచ్చిన ఒమైర్‌ యూసుఫ్‌ 35 చేయగా తయ్యబ్‌ తాహిర్‌ 108తో అద్భుత సెంచరీ చేశారు. ఖాసిమ్‌ అక్రమ్‌ 0 , మహ్మద్‌ హరీస్‌ 2, నిరాశపరిచిన ముబాసిర్‌ ఖాన్‌ 35, మెహ్రాన్‌ ముంతాజ్‌ 13 , మహ్మద్‌ వాసిం జూనియర్‌ 17, సుఫియాన్‌ ముఖీమ్‌ 4 పరుగులు చేయడంతో పాకిస్తాన్‌ 352 పరుగుల భారీ స్కోర్‌ చేయగలిగింది. భారత బౌలర్లలో ఆర్‌ఎస్‌ హంగర్గేకర్‌, రియాన్‌ పరాగ్‌ తలో రెండు వికెట్లు తీయగా హర్షిత్‌ రాణా, మానవ్‌ సుతార్‌, నిశాంత్‌ సింధు ఒక్కో వికెట్‌ దక్కింది.

  • టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా

ఆసియా 'ఎమర్జింగ్‌' కప్‌ టోర్నీ తుది పోరుకు సర్వం సిద్దమైంది. కొలంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత-ఏ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సెమీఫైనల్‌లో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగింది. మరోవైపు పాకిస్తాన్‌ మాత్రం తమ జట్టులో ఒక మార్పు చేసింది. అమాద్‌ బట్‌ స్థానంలో మెహ్రాన్‌ ముంతాజ్‌ తుది జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు:
ఇండియా ఎ: సాయి సుదర్శన్‌, అభిషేక్‌ శర్మ, నికిన్‌ జోస్‌, యష్‌ ధుల్‌ (కెప్టెన్‌), రియాన్‌ పరాగ్‌, నిశాంత్‌ సింధు, ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), మానవ్‌ జగ్దూసకుమార్‌ సుతార్‌, యువరాజ్‌సింగ్‌ దోడియా, హర్షిత్‌ రాణా, రాజ్‌వర్ధన్‌ హంగర్గేకర్‌
పాకిస్తాన్‌ ఎ: సయీమ్‌ అయూబ్‌, తయ్యబ్‌ తాహిర్‌, మహ్మద్‌ హారీస్‌ (కెప్టెన్‌), సాహిబ్జాదా ఫర్హాన్‌, ఒమైర్‌ యూసుఫ్‌ (వైస్‌ కెప్టెన్‌), ఖాసిం అక్రమ్‌, ముబాసిర్‌ ఖాన్‌, మహ్మద్‌ వసీం జూనియర్‌, మెహ్రాన్‌ ముంతాజ్‌, అర్షద్‌ ఇక్బాల్‌, సుఫియాన్‌ ముఖీమ్‌