ప్రజాశక్తి - పెద్దాపురం (కాకినాడ) : యాసలపు సూర్యారావు భవనంలో చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు మంగళవారం పర్యావరణం పరిరక్షణపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపు కో-ఆర్డినేటర్ రొంగల అరుణ్ కుమార్ మాట్లాడుతూ గత నెల 7వ తేదీ నుండి నిర్వహిస్తున్న ఈ సమ్మర్ క్యాంపు ఈనెల 9 వ తేదీన ముగుస్తుందన్నారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాలుగా నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. 9వ తేదీన జరిగే ముగింపు సభలో విజేతలకు బహుమతి ప్రధానం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రకారుడు దుంగల శ్యామ్ కుమార్, పూజిత, సత్య, కూనిరెడ్డి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.










