Jul 26,2023 14:58

టోక్యో: జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత పురుషుల డబుల్స్‌ జోడీ సాత్తిక్‌-చిరాగ్‌ శెట్టి శుభారంభం చేయగా.. మహిళల సింగిల్స్‌లో పివి సింధు తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో సింధు 12-21, 13-21 తేడాతో చైనాకు చెందిన జాంగ్‌ యి మన్‌ చేతిలో వరుససెట్లలో ఓటమిపాలైంది. ఈ ఏడాది ఆడిన 13 బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ టోర్నీల్లో సింధు ఏడింటిలో తొలి రౌండ్‌లోనే ఇంటిదారిపట్టడం గమనార్హం. మరో షట్లర్‌ మాల్విక బన్సోద్‌ 7-21, 15-21తో అహోరీ(జపాన్‌) చేతిలో చిత్తుగా ఓడింది.