భోపాల్ : కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం ఆ పార్టీ నేతలు నడపడం లేదని, పట్టణ ప్రాంతం (ఆర్బన్) నక్సల్స్‌కు ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. భోపాల్‌లో కార్యకర్త మహాకుంభ్ కార్యక్రమంలో మోడీ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌కు మరోసారి అవకాశం ఇస్తే మధ్యప్రదేశ్‌ను బీమారు (వెనుకబాటుతనం) లోకి నెడుతుందని అన్నారు. కాంగ్రెస్ సంకల్ప బలం కోల్పోయిందని, ఆ పార్టీ కార్యకర్తలు మౌన ప్రేక్షకుల్లా మిగిలారని విమర్శించారు. అలాగే వేరే గత్యంతరం లేక కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును విముఖతతోనే ఆమోదించాయని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. వారికే మాత్రం అవకాశం దొరికినా కచ్చితంగా మహిళా బిలుపై వెనక్కి తగ్గేవారని అన్నారు. కాంగ్రెస్‌ను తప్పుపట్టిన ఇనుముతో పోల్చారు, ముందుగా ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్, తర్వాత మొత్తంగా దివాళా తీసిందని అన్నారు.










