Nov 01,2023 12:01

అమరావతి : సిఐడి చీఫ్‌ సంజయ్, ఏఏజీ పొన్నవోలుపై చర్యలకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ.. రాష్ట్ర హైకోర్టులో పిల్‌ దాఖలైంది. స్కిల్‌ కేసు దర్యాప్తులో ఉండగా ప్రెస్‌మీట్లు పెట్టారని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సత్యనారాయణ పిటిషన్‌ వేశారు. ప్రెస్‌మీట్లతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వట్లేదని తెలిపారు. కోర్టు అనుమతితో మరోసారి ఆర్టీఐ ద్వారా వివరాలు అడగాలని, ప్రజాధనం ఎంత వృథా అయిందో వివరాలు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.