Oct 21,2023 08:10

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌:ఆంధ్రప్రదేశ్‌ పండ్ల తోటల రైతు సంఘం రాష్ట అధ్యక్షులుగా రామకృష్ణుడు, ఉపాధ్యక్షులు వి.శివారెడ్డి, కార్యదర్శిగా ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డిని ఎన్నుకున్నారు. తాడిపత్రిలో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు వి.రాంభూపాల్‌ శుక్రవారం తెలిపారు. రాష్ట కమిటీ సభ్యులుగా త్రిలోక్‌, జి.రాజారామిరెడ్డి, వెంకటచౌదరి, గార్లదిన్నె చెన్నారెడ్డి, వరదాయపల్లి లక్ష్మీనారాయణరెడ్డితో కూడిన 15 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. పండ్ల తోటల రైతుల డిమాండ్ల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతాంగాన్ని సమీకరించి సమస్యల పరిష్కానికి నూతన కమిటీ పోరాటాలు నిర్వహించనుందని చెప్పారు.