గుంటూరు : ఎపి కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ కేబినెట్ సమావేశ మందిరంలో ప్రారంభమైంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎస్‌ఐపిబి ప్రతిపాదనలకు.. రూ.19 వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమల ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం. సమగ్ర కులగణనకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీపై కేబినెట్ చర్చించనుంది. ప్రస్తుతం భేటీ కొనసాగుతోంది.










