- గ్రీన్ సిగల్ ఇచ్చిన ఐసిసి, పిసిబి
ముంబయి: అక్టోబర్‌లో భారత్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లో కీలకమైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఒకరోజు ముందు జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ అక్టోబర్ 14న నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది. దీనికి ఐసిసితో పాటు పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు బోర్డు(పిసిబి) సైతం అంగీకారం తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం ఇరుజట్ల మధ్య అక్టోబర్ 15న ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, అదేరోజు శనరన్నవరాత్రి వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను 14న ముందే నిర్వహించాలని బిసిసిఐని అక్కడి పోలీసులు కోరిన విషయం తెలిసిందే.










