హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్న కారును తనిఖీ చేశారు. అధికారులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో పర్యటిస్తున్న కవిత ప్రయాణిస్తున్న కారును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ అధికారులకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పూర్తిగా సహకరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక ఇవాళ సోషల్ మీడియాలో కల్వకుంట్ల కవిత ఓ ట్వీట్ చేశారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. సీఎం కేసీఆర్ ని చూసి రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వారికి వాతలే మిగులుతాయి తప్ప ఫలితం మాత్రం శూన్యం అంటూ ఎద్దేవా చేశారు. వాళ్లు ఎన్ని చోట్ల పోటీ చేసినా విజయం మాత్రం బీఆర్‌ఎస్ పార్టీదేనన్నారు.










