Jul 23,2022 12:55

ప్రజాశక్తి - తాళ్ళరేవు (కాకినాడ) : గాడిమొగ రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ కంపెనీలో శనివారం ఉదయం ఆక్టోపస్‌ కమాండో టీమ్‌ కౌంటర్‌ టెర్రరిస్ట్‌ అటాక్‌ మాక్‌ డ్రిల్‌ చేశారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, డిఎస్పీ భీమారావు, కాకినాడ రూరల్‌ సీఐ కె.శ్రీనివాసు ఆధ్వర్యంలో గాడిమోగలో రిలియన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ కంపెనీలో టెర్రరిస్టులు అటాక్‌ చేస్తే కౌంటర్‌ అటాక్‌ ఏ విధంగా చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఉద్యోగులను, కంపెనీని ఏ విధంగా కాపాడుకోవాలో అనే అంశంపై ఆక్టోపస్‌ అడిషనల్‌ ఎస్పీ కే.నగేష్‌ బాబు, ఆక్టోపస్‌ డిఎస్పీ కేఎస్‌ఎస్‌.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఈ సంద్భంగా ఆక్టోపస్‌ అడిషనల్‌ ఎస్పీ కే.నగేష్‌ బాబు మాట్లాడుతూ ... రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్‌ రంగసంస్థల్లో టెర్రరిస్టు వంటి దేశ ద్రోహులు అటాక్‌ చేస్తే కౌంటర్‌ అటాక్‌ ఏ విధంగా చేయాలో వివరించారు. ప్రైవేట్‌ సెక్యూరిటీ, ఫైర్‌, మెడికల్‌, రెవెన్యూ, బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బఅందాలతో లోకల్‌ పోలీసులను సమన్వయపరిచి ఆపరేషన్‌ చేశారు. మాక్‌ డ్రిల్‌ లో టెర్రరిస్టు లు రిలయన్స్‌ అడ్మిన్‌ బ్లాక్‌ ని అటాక్‌ చేయడంతో అన్నీ శాఖల ప్రభుత్వ అధికారులను సమన్వయంతో టెర్రరిస్టులను మట్టుపెట్టి ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. ఈ ఆపరేషన్‌ లో కాకినాడ రూరల్‌ సీఐ కె.శ్రీనివాసు, కోరింగ ఎస్సై శివ కుమార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రవితేజ, రిలయన్స్‌ సంస్థ ప్రైవేట్‌ సెక్యూరిటీ హెడ్‌ సుఖ్చిర్‌ థిండ్‌, కమండెంట్‌ శ్రీనివాస్‌, ఆర్మెడ్‌ రిజర్వ్‌ పోలీసులు పాల్గొన్నారు.