అమరావతి : ఎఎజి, సిఐడి చీఫ్ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారంటూ ... ఎంపి రఘురామ వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఎఎజి, సిఐడి చీఫ్ మీడియా సమావేశాలు నిర్వహించారని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ అధ్యక్షుడు సత్యనారాయణ గతంలో పిల్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను సిజె జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ విచారించారు. ఈక్రమంలో ... 'నాట్ బిఫోర్ మీ' అంటూ జస్టిస్ రఘునందన్ విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో రఘురామ పిటిషన్‌ను ఏ బెంబ్ విచారించాలో సిజె మళ్లీ నిర్ణయించనున్నారు.










