ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ నోకియా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 23న భారత్ మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. నోకియా సీ32 పేరుతో, ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదలకానున్న ఈ ఫోన్‌లో వినియోగదార్లను వావ్ అనిపించే ఫీచర్లను అందిస్తోందని సమాచారం. 6.5 అంగుళాల హెచ్‌డి రిజల్యూషన్‌తో ఐపిఎస్ ఎల్‌సీడి డిస్‌ప్లేను అందిస్తోంది. అంతేకాకుండా యునిఎస్‌ఓసీ ఎస్‌సీ 9863 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 3జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకునే అవకాశం ఉంది. 10వాట్స్‌కి సపోర్ట్ చేసే 5000 ఎంఎహెచ్ బ్యాటరీని కూడా అందిస్తున్నారు. ఇక కెమెరా విషయాల్లోనూ యువతను ఆకట్టుకునేలా 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు 5.2 బ్లూటూత్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు.










