Oct 20,2022 15:56

అమరావతి: 'ప్చ్‌... ఈ ముఖ్యమంత్రికి ఎలా చెబితే అర్థం అవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. చివరికి చిన్న పిల్లలు కూడా వంతెన అప్రోచ్‌ రోడ్డు కోసం నిరసనల బాట పట్టే స్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని టిడిపి అధినేత నారా చంబ్రాబునాయుడు ట్విట్టర వేదికగా స్పందించారు. ప్రజా సమస్యలపై ఈగో వద్దు జగన్‌ రెడ్డీ . ఇష్యూను సాల్వ్‌ చేయండి అంటూ నర్సీపట్నంలో విద్యార్థుల పోరాటంపై టిడిపి అధినేత చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ''ప్చ్‌... ఈ ముఖ్యమంత్రికి ఎలా చెబితే అర్థం అవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. చివరికి చిన్న పిల్లలు కూడా వంతెన అప్రోచ్‌ రోడ్డు కోసం నిరసనల బాట పట్టే స్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారు. నర్సీపట్నంలో వరాహ నదిపై మా ప్రభుత్వ హయాంలోనే వంతెన నిర్మించాం... వైసీపీ ప్రభుత్వం వచ్చాక పెండింగ్‌లో ఉన్న ఆ కాసింత అప్రోచ్‌ రోడ్డు పనులు కూడా పూర్తిచేయలేదు. దీంతో మోడల్‌ స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లలో దిగి తమ కష్టం తీర్చాలని వేడుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి తన పాలనలో కొత్తగా ఏం కట్టలేరని ప్రతి ఒక్కరికి తెలుసు... కనీసం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసినా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది'' అంటూ చంద్రబాబు ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.