Nov 09,2023 13:05

దుబ్బాక : మెదక్‌ ఎంపి, దుబ్బాక బిఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ యువకుడి చేతిలో కత్తిపోటుకు గురైన ప్రభాకర్‌ రెడ్డికి శస్త్రచికిత్స జరిగింది. దీంతో గత 10 రోజులుగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈరోజు ప్రభాకర్‌ రెడ్డి ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. దుబ్బాకలో అంబులెన్స్‌ దిగిన తర్వాత వీల్‌చైర్‌లో రిటర్నింగ్‌ కార్యాలయానికి వచ్చి నామినేషన్‌ పత్రాలను ఆర్వో గరిమ అగర్వాల్‌కు సమర్పించారు.