ప్రజాశక్తి-బాపట్ల:విభజన తరువాత పరిశోధనా రంగం అభివృద్ధిలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడి ఉందని శాసన మండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. భారతదేశంలో ఆవిష్కృతమైన పరిశోధనా సంస్థల నిర్వహణ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. 'శాస్త్ర సాంకేతిక రంగాల అభివఅద్ధి..అవరోధాలు' అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు బాపట్లలోని ఎన్‌జిఒ హోమ్‌లో ఆదివారం జరిగింది. ఈ సదస్సులో ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి పట్ల ఇదే విధమైన పరిస్థితి కొనసాగితే శాస్త్రీయ దఅక్పథం ఎలా అభివఅద్ధి చెందుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత పరిశోధనారంగం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి ఉందని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని దెబ్బతీసే ఆలోచనా విధానంతో ప్రభుత్వాలు అవలంబిస్తోన్న ధోరణి ఏమాత్రమూ సమర్ధనీయం కాదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 పరిశోధనా కేంద్రాలు పనిచేస్తున్నాయని, వాటి నిర్వహణ కోసం రూ.11,500 కోట్లు మంజూరు చేయాల్సి ఉంటే.. కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని వెల్లడించారు. పరిశోధనా రంగం అభివృద్ధి చెందకపోతే భవిష్యత్తులో భారతదేశ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు. ఇస్రోలో కీలకమైన పరిశోధన ఫలితాల వెనుక ఎందరో శాస్త్రవేత్తల అవిరళ కఅషి ఉందని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్సీ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎం.గేయానంద్ మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి పాలకులు నిరోధకంగా మారుతున్నారన్నారు. శాస్త్రీయ దఅక్పథంతోనే విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణానికి పట్టిష్టమైన పునాదులు పడతాయని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ భారతదేశం తరువాత స్వాతంత్య్రం పొందిన చైనాలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివఅద్ధి చెందిందని తెలిపారు. ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అవసరమనే అంశాన్ని ప్రభుత్వాలు మర్చిపోతున్నాయని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి గంగయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి పిసి సాయిబాబు, విశ్రాంత ప్రొఫెసర్ కె.విజరుకుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి మజుందార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి టి.కఅష్ణమోహన్, జనవిజ్ఞానవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసంగించారు.










