హైదరాబాద్ : మెదక్ ఎంపి దుబ్బాక బిఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నానికి సంబంధించి తెలంగాణ మంత్రి కెటిఆర్ మంగళవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ' ఇంకా ఆధారాలు కావాలా ? ' అని ఓ పోస్టు పెట్టారు. నిన్న ఎన్నికల ప్రచారం ముగించుకొని కారు ఎక్కబోతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి వైపు రాజు అనే యువకుడు దూసుకొచ్చి కత్తితో ప్రభాకర్ రెడ్డి కడుపులో పొడిచాడు. ఈ ఘటన వెనుక ఏ పార్టీ, ఎవరు ఉన్నారనే విషయాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కెటిఆర్ ట్విటర్ ద్వారా స్పందించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ గూండానే అంటూ.. ఆ పార్టీ కండువాతో ఉన్న నిందితుడి ఫొటోలను పోస్ట్ చేశారు. ఇంకా ఆధారాలు కావాలా ? అని రాహుల్‌గాంధీని కెటిఆర్ ప్రశ్నించారు.










