ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నరేందర్ ఈనెల 30న రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. సాయంత్రం 4.47 గంటల కు తాడేపల్లి నుంచి బయలుదేరి రాజ్‌భవన్‌కు వెళ్తారని, కార్యక్రమం అనంతరం నివాసానికి చేరుకుంటారని సిఎం కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.










