యాదాద్రి భువనగిరి : బీఆర్‌ఎస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న జిల్లాలోని నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమాదేవి, ఆమె భర్త ప్రేమ్ చందర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకఅష్ణా రెడ్డి తెలిపారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు వివరాలను వెల్లడించారు. ఇద్దరు కూడా పార్టీ నియమ నిబంధనలు ఉల్లంగించారని పేర్కొన్నారు.ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కి పనిచేయకపోగా, అవతలి పార్టీకి సహకరిస్తున్నారని చెప్పారు. ఇప్పటి నుంచి వాళ్లకు, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు. అదే సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు.










