అమరావతి : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం ఉదయం అమరావతి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు చంద్రబాబుపై వరుసగా కేసులు నమోదవుతోన్న నేపథ్యంలో ... లోకేశ్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. కేసుల విషయంలో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారితో చర్చించనున్నారు.










