ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీవారిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి నారా భువనేశ్వరి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భువనేశ్వరితో పాటు టీడీపీ ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం భువనేశ్వరి నారావారిపల్లెకు వెళ్లారు. భువనేశ్వరిని కలిసేందుకు వచ్చిన స్థానికులు, టిడిపి కార్యకర్తలను పోలీసులు ఆలయానికి దూరంగా పంపించారు.










