Oct 31,2023 15:25

విజయనగరం: కంటకాపల్లి-అలమండ మధ్య జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి విజయనగరం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను నారా భువనేశ్వరి పరామర్శించారు. తెలుగుదేశం నేతలు అశోక్‌ గజపతిరాజు, కళా వెంకట్రావు, వంగలపూడి అనిత తదితరులతో కలిసి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన భువనేశ్వరి బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.