ప్రజాశక్తి-ఎమ్మిగనూరు రూరల్(కర్నూలు) : తెలుగుజాతి ఖ్యాతిని జాతీయ రాజకీయాలలో చాటి చెప్పిన శకపురుషుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని ఎమ్మిగనూరు నియోజకవర్గ టిడిపి నేతలు పేర్కొన్నారు. ఎన్‌టిఆర్ శత జయంతి (1923-2023) పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ''ద్రౌపతి ముర్ము'' చేతుల మీదుగా నేడు రాష్ట్రపతి భవన్‌లో రూ.100 ఎన్టీఆర్ గారి స్మారక నాణెంను విడుదల చేయడం పట్ల ఎమ్మిగనూరు నియోజకవర్గ టిడిపి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం స్థానిక కోట్ల క్యాంపు కార్యాలయం నందు ఎన్టీఆర్ రూ.100 నాణెం పోస్టర్‌ను ప్రదర్శించారు. ఎన్టీఆర్ చిత్రపటమునకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎన్టీ రామారావుకు భారతరత్న ప్రకటించి తెలుగు ప్రజల అందరిని సంతోషపరచాలని, తెలుగుజాతిని గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి.అల్తాఫ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప్పర(సగర) ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు, కర్నూలు పార్లమెంట్ టిడిపి కురువ సాధికారిక కమిటీ సభ్యులు, అడ్వకేట్ కె.టి. మల్లికార్జున, ఎన్టీఆర్, యన్.బి.కె. ఫ్యాన్స్ సేవా సమితి పట్టణ అధ్యక్షులు రోజా ఆర్ట్స్‌ఉసేని, రుద్రాక్షల రంగన్న, టీడీపి ముస్లిం మైనార్టీ నాయకులు కే.యం.డి. అబ్దుల్ జబ్బార్,మేటి వలి భాష, గోరా భాష,మహబూబ్ బాషా, ఆఫ్గాన్ వలి భాష, టిడిపి ఎస్సీ సెల్ నాయకులు సప్లయర్స్ బంగారప్ప, కంపాడు చిన్న రంగన్న, పందికోన సురేష్, జాలవాడి ఏసన్న తదితరులు పాల్గొన్నారు.










