Sep 16,2023 15:38

హైదరాబాద్‌/చెన్నై: జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ ఉగ్రవాదుల కుట్రను భగం చేసింది. దక్షిణాదిలోని 31 చోట్ల సోదాలు నిర్వహించి.. పలువురిని అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో భారీ ఉగ్రకుట్ర బయటపడింది. కోయంబత్తూరులో 22 ప్రాంతాల్లో, హైదరాబాద్‌లో 5 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, అరబిక్‌ భాషలో ఉన్న కొన్ని పేపర్లు, వీటితో పాటు రూ. 60 లక్షలు, 18,200 యుఎస్‌ డాలర్స్‌ స్వాధీనం చేసుకుంది.