Oct 09,2023 11:03

జైపూర్‌ : రాజస్థాన్‌లోని సికార్‌ పట్టణంలో నీట్‌కు శిక్షణ పొందుతున్న 18 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భరత్‌పూర్‌ జిల్లా నాద్‌బై పట్టణానికి చెందిన నితిన్‌ ఫౌజ్దార్‌ నీట్‌ శిక్షణ కోసం జూన్‌లో సికార్‌ పట్టణానికి వచ్చాడు. ఒక కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. శనివారం తరగతులకు వెళ్లకుండా ప్రైవేట్‌ హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికార్‌ పట్ణణంలో మూడు రోజుల వ్యవధిలో ఇది రెండో ఆత్మహత్య. ఈ నెల 3న నీట్‌కు శిక్షణ పొందుతున్న 16 ఏళ్ల కౌషల్‌ మీనా కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు.