Oct 01,2023 22:18

మాలే : మాల్దీవులు అధ్యక్షుడిగా ప్రతిపక్ష కూటమి అభ్యర్థి మహ్మద్‌ ముయిజ్జు ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షులు ఇబ్రహీం మహమ్మద్‌ సోలిV్‌ాతో హోరాహోరీగా జరిగిన పోటీలో ముయిజ్జు ఎన్నికైనట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. శనివారం మాల్దీవులు అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 86 శాతం ఓటింగ్‌ నమోదయింది. ముయిజ్జుకి సుమారు 54 శాతం ఓట్లు లభించగా, ప్రస్తుత అధ్యక్షులు మొహమ్మద్‌ సోలిV్‌ాకి 46 శాతం ఓట్లు లభించాయి. పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, ప్రొగ్రెసివ్‌ పార్టీ ఆఫ్‌ మాల్దీవ్స్‌ అనే ప్రతిపక్ష పార్టీల కూటమి తరుపున ముయిజ్జు పోటీ చేశారు. ముయిజ్జు ఎన్నికతో మాల్దీవుల విదేశాంగ విధానంలో తీవ్రమైన మార్పులు రానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మాల్దీవులులో వచ్చే నెలలో ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమవుతున్నారు. పార్లమెంటరీ పాలనా వ్యవస్థకు మారాలా.. వద్దా అనే విషయంపై ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది.