- టైగర్ గ్లోబల్ వాటాలు స్వాధీనం
న్యూఢిల్లీ : ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లోని మరిన్ని వాటాలను వాల్‌మార్ట్ స్వాధీనం చేసుకుందని సమాచారం. ఆ సంస్థలోని టైగర్ గ్లోబల్ నుంచి దాదాపు రూ.11 వేల కోట్ల పైగా విలువ చేసే వాటాలను వాల్‌మార్ట్ స్వాధీనం చేసుకోవడానికి ఒప్పందం చేసుకుందని వాల్‌స్ట్రీట్ ఓ కథనంలో వెల్లడించింది. తాజా ఒప్పందంలో ఫ్లిప్‌కార్ట్ విలువను 35 బిలియన్ డాలర్లుగా లెక్కించారు. 2021లో వాల్‌మార్ట్, ఇతర ఇన్వెస్టర్లు తమ వాటాలను సాఫ్ట్‌బ్యాంక్‌కు విక్రయించే సమయంలో ఫ్లిప్‌కార్ట్ విలువను 38 బిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు. 2009లో టైగర్ గ్లోబల్ తొలి సారి ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడులు పెట్టింది. 2018లో వాల్‌మార్ట్ 16 బిలియన్ డాలర్లు వెచ్చించి ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాలను దక్కించుకుంది. తాజాగా కొనుగోలు చేసిన వాటా మొత్తం తెలియాల్సి ఉంది.










