Aug 14,2023 15:33

ప్రజాశక్తి-పత్తికొండ (కర్నూలు) : విద్యార్థి దశ నుంచి నైతిక విలువలను పెంపొందించుకోవాలని పత్తికొండ డిఎస్‌పి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పత్తికొండ పట్టణంలోని ఎంపీపీ స్కూల్‌లో కెపిఆర్‌ మైత్రి చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు రామ్మోహన్‌ ఆధ్వర్యంలో 76వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిఎస్‌పి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఉన్నత శిఖరాలను అవరోధించాలన్నారు. విద్యార్థి దశ నుంచి సత్ప్రవర్తన, క్రమశిక్షణ నైపుణ్యం, పట్టుదల పెంపొందించుకోవాలన్నారు. స్వాతంత్ర పోరాటాలలో మహాత్మా గాంధీ, జవహర్లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభారు పటేల్‌ మరెందరో మహనీయులు ప్రాణ త్యాగాలను చేశారని వారిని గుర్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ మాజీ సర్పంచ్‌ సోమశేఖర్‌, డాక్యుమెంట్‌ రైటర్‌ నాగేంద్ర స్కూల్‌ హెడ్మాస్టర్‌ బేబీ నిర్మల, టీచర్లు మాధవ లత, వీణ, ప్రశాంతి, పద్మలత తదితరులు పాల్గొన్నారు.