ఢిల్లీ : భారత్ తొలిసారిగా అతిథ్యమిస్తున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు ఢిల్లీ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సదస్సు ప్రారంభించారు. తన ప్రసంగంతో మోడీ సదస్సును ప్రారంభించారు. ప్రారంభోపన్యాసంలో మోడీ మొరాకోలో సంభవించిన భూకంపంపై స్పందించారు. మొరాకోలో భూకంపం సంభవించడం చాలా విరాచకరమని ప్రధాని మోడీ అన్నారు. భూకంపంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రకతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మొరాకోకు భారత్ అండగా ఉంటుందని తెలిపారు. అంతకుముందు జీ-20 సదస్సు జరిగే భారత్ మండపం వద్ద.. ప్రపంచ నేతలకు ప్రధాని మోడీ స్వయంగా స్వాగతం పలికారు.










