చెన్నై : ''సనాతన ధర్మం''పై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ గురువారం సమర్థించారు. ఏ మతాన్ని, మత విశ్వాసాలను దెబ్బతీసే ఉద్దేశం తన కుమారునికి లేదని అన్నారు. సనాతన ధర్మం పేరిట బోధించే అమానవీయ సూత్రాలు.. షెడ్యూల్డ్ కులాలు, తెగలు మరియు మహిళల పట్ల చూపుతున్న వివక్షను గురించి మాత్రమే ఉదయనిధి వ్యాఖ్యానించారని అన్నారు. కొంతమంది కులం పేరుతో వివక్షను ప్రచారం చేస్తున్నారని, ఇప్పటికీ ఆధ్యాత్మిక వేదికలపై మహిళలను కించపరుస్తున్నారని విమర్శించారు. ఈ అణచివేత సూత్రాలకు వ్యతిరేకంగా ఉదయనిధి వైఖరిని బిజెపి అనుకూల శక్తులు సహించలేకపోతున్నాయని, దీంతో ఆయన ప్రసంగంపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
'' మనం చంద్రునిపై చంద్రయాన్‌ను ప్రయోగించినప్పటికీ.. కొందరు సనాతన ధర్మం పేరుతో స్త్రీలపై అణచివేతను కొనసాగిస్తున్నారు. ఉదయనిధి ఇటువంటి అణచివేత భావజాలానికి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడారు. ఆ సిద్ధాంతాల పేరుతో నిర్వహించే ఆచారాల నిర్మూలనకు పిలుపునిచ్చారు'' అని స్టాలిన్ అన్నారు. సనాతన వివక్ష పట్ల బిజెపికి పట్టింపు లేదని ఆయన అన్నారు. యుపికి చెందిన ఓ మత గురువు తన కుమారుడి తలపై రూ.10 కోట్ల బహుమతి ప్రకటించంపై ఆ రాష్ట్ర ప్రభుత్వాన్నినిలదీశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకోకుండా .. తనకుమారునిపై కేసులు నమోదు చేసిందని మండిపడ్డారు. బిజెపి సోషల్ మీడియా విభాగం ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ అబద్దాలను విస్తృతంగా ప్రచారం చేస్తోందని.. ఉదయనిధి తమిళంలో కానీ ఇంగ్లీషులో కానీ ''జాతి హత్య'' అనే పదాన్ని వినియోగించలేదని, అయినప్పటికీ బిజెపి అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రి మండలి సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ఉదయనిధి వ్యాఖ్యలపై సరైన స్పందన అవసరమని పేర్కొడం నిరుత్సాహపరిచిందని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఏదైనా నివేదికను తెలుసుకునేని, ధఅవీకరించుకోవడానికి ప్రధాన మంత్రికి అన్ని వెసులుబాట్లు ఉన్నాయని.. కానీ ఉదయనిధి గురించి తప్పుగా చేయబడుతున్న ప్రచారం గురించి ప్రధానికి తెలిసి మాట్లాడుతున్నారా..? తెలియక మాట్లాడుతున్నారా..? అంటూ స్టాలిన్ ప్రశ్నించారు. 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' అనేది రాజకీయ జిమ్మిక్కు అని ప్రతిపక్ష కూటమిలో విభేదాలు సఅష్టించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని విమర్శించారు.










