ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : హాస్టల్ లోని ఇంటర్ విద్యార్థిని కనిపించకుండాపోయిన ఘటన గురువారం ఉదయం పుట్లూరు మండల కేంద్రంలోని కెజివిబి హాస్టల్ లో జరిగింది. పెద్ద పడమల గ్రామం, తాడిపత్రి రూరల్ మండలానికి చెందిన కె.వెంకటరమణ కుమార్తె కె.ఇందుజా (16) కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఇంటర్ చదువుతుంది. మండల కేంద్రంలోని కెజివిబి హాస్టల్ లో ఉంటుంది. ఈరోజు ఉదయం సుమారు 5:45 గంటల సమయంలో ఇందుజా హాస్టల్ లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయిందని హాస్టల్ నిర్వాహకులు తెలిపారు. ఈ విషయాన్ని హాస్టల్లో ఉన్న టీచర్స్, విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపారు. మిస్సింగ్ అయిన విద్యార్థిని తరపు తల్లిదండ్రులు, టీచర్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లి హేమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ హనుమంతు తెలిపారు.










