Sep 12,2023 12:35

హిందూపురం (అనంతపురం) : శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని అబాద్‌ పేటలో ఇంటి ముందు నిలబెట్టిన నాలుగు బైక్‌లకు మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఆ మంటల్లో నాలుగు బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. వాహనాల యజమానులు వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు.