Nov 02,2023 12:38

తిరుపతి : తిరుమల వేంకటేశ్వరుడిని మంత్రి ఆర్కే రోజా గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో రోజా వేంకటేశ్వరుడి సేవలో పాల్గొన్నారు. టిటిడి ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొన్న ఆమెకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.