ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం,జీ.ఓ 215ను అమలు చేసి,పాఠ్య పుస్తకాలు అందించాలిని గురువారం రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులను ఆదుకోవాలని ఆదోని బీమాస్ కూడలిలో నిరసన తెలియజేసి,స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిపాలన అధికారికి వినతిపత్రం అందజేశారు.కార్యక్రమం ఉద్దేశించి ఆర్పిఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్,జిల్లా కార్యదర్శి బాలు మాట్లాడుతు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపేసి,అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రభుత్వం పుస్తకాలు ఇవ్వకపోవడం ఇలా నిర్వీర్య దిశగా ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు.జూనియర్ కళాశాల విద్యార్థులకు కనీస వసతులు అందించకపోవడం వలన కుటుంబ ఆర్థిక ఇబ్బందులు,డ్రాప్ అవుట్లు పెరిగి పోవడం,హాజరు శాతం తగ్గడం,అర్థ ఆకలితో పస్తులుండటం ఇలాంటి సమస్యలతో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్య అందని ద్రాక్షలాగా మారింది అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వ విద్యా అధికారులు స్పందించి మధ్యాహ్న భోజన పథకం జీ. ఓ నం. 215 అమలు చేసి విద్యార్థులను ఆదుకోవాలి అలాగే వెనుకబడిన ప్రాంతంలో నిరక్షరాస్యత,కుటుంబ ఆర్థిక పరిస్థితులను దఅష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు అందించాలి డిమాండు చేశారు.ఈ కార్యక్రమంలోవిద్యార్థినులు, డివిజన్ నాయకులు వినోద్,వీరేశ్, మహేష్, విష్ణు,పవన్, రాజు, నరసింహ పాల్గొన్నారు.










