బాకు(అజర్‌బైజాన్): ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మెహూలీ ఘోష్ కాంస్య పతకం చేజిక్కించుకొని పారిస్ ఒలింపిక్స్-2024కు అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల 10మీ. ఎయిర్ రైఫిల్ ఫైనల్లో మెహూలీ ఘోష్ 229.8పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో తొలి రెండు స్థానాలో చైనా షూటర్లు జీహూ హాన్, జిలిన్ వాంగ్ నిలిచి బంగారు, రజత పతకాలను చేజిక్కించుకున్నారు. అలాగే భారత్‌ఖకే చెందిన తిలోత్తమ సేన్ 208.4పాయింట్లు సాధించి పారిస్ ఒలింపిక్స్-2024కు అర్హత సాధించలేకపోయింది.










