Oct 08,2023 15:25

ప్రజాశక్తి-విఆర్‌పురం(అల్లూరి):  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా.. పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 15న సిపిఎం ఆధ్వర్యంలో రంపచోడవరంలో బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ పిలుపునిచ్చారు. వి ఆర్‌ పురం మండలం రేఖపల్లి సిపిఎం కార్యాలయం వద్ద జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ బహిరంగ సభకు సిపిఎం పోలిట్‌ బ్యూరో సభ్యులు బీ.వీ రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, సిఐటియు ఏ.వి నాగేశ్వరరావు హాజరవుతారని తెలిపారు. ఈ బహింరగ సభలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సోయం.చిన్నబాబు, మండల నాయకులు తోడం.రాజు, వడ్లాది.రమేష్‌, తాతబాబు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.